దాంతో వరుణ్ తేజ్ తను తదుపరి చేయబోయే సినిమాల విషయంలో ఎటువంటి మొహమాటం లేకుండా , ఎవరేమనుకున్నా ఫరవాలేదు తను అనుకున్నట్లుగా కథ వచ్చాకే,సంతృప్తి చెందాకే షూటింగ్ కి వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. దాంతో హరీష్ శంకర్ సినిమాలో తన క్యారక్టర్ కు సంభందించిన సీన్స్ ని మార్చమని చెప్పినట్లు సమాచారం. 

గత కొద్ది కాలంగా సరైన హిట్ లేకుండా ఉన్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న కొత్త సినిమా వ‌ర్క్‌ని ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని రెడీ చేస్తున్నారట.  త్వ‌ర‌లోనే సినిమా సెట్ మీద‌కి వెళ్ల‌ే ఈ సినిమా.. త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొని మంచి విజ‌యం సాధించిన జిగ‌ర్ తండా అనే సినిమాకి  తెలుగుకు రీమేక్. 

హరీష్ శంకర్ ఉన్నది ఉన్నట్లు కాకుండా.. ఆ సినిమాలోని మూల‌క‌థ‌, క్యార‌క్ట‌రైజేష‌న్లు మాత్ర‌మే తీసుకొని మిగ‌తా అంత త‌న‌దైన‌శైలిలో మార్చేస్తున్నాడ‌ని స‌మాచారం. ద‌బాంగ్ సినిమాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్లుగా మార్చినట్లుగా ఈ స్క్రిప్టుపైనా పనిచేస్తున్నారట. 

దానికి తోజు వరుణ్ తేజ ప్రత్యేక శ్రద్ద పెట్టడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నాడట. సోల్ మిస్సవకుండా.. మ‌రింత స్క్రీన్ ప్లే టైట్ గా , క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో మారుస్తున్నాడ‌ట‌. వ‌రుణ్ తేజ్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ నిర్మించ‌నుంది.