`క్షణం`, `ఎవరు` వంటి సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రాలతో విజయాలను అందుకున్నారు అడవిశేషు. కమర్షియల్‌ సినిమాలకు అతీతంగా కంటెంట్‌తో కూడిన సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ప్రస్తుతం `మేజర్‌`, `హిట్‌2` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయనకు హర్రర్‌ సినిమాలంటే భయమట. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వీర్‌ సాగర్‌, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో, వీర్‌ సాగర్‌ దర్శకత్వంలో హ్రరర్‌ చిత్రం `మరణం` రూపొందుతుంది. ఓషియన్‌ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. 

ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని అడవిశేషు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `పోస్టర్‌ బాగుందని, భయపెట్టేలా ఉందన్నారు. ఈ సందర్భంగా తనకు హర్రర్‌ సినిమాలంటే భయమని చెప్పారు. కానీ చాలా మంది ప్రేక్షకులు ఇలాంటి హర్రర్‌ చిత్రాలను చూసేందుకు ఇష్టపడతారని, ఈ చిత్ర పోస్టర్‌, టీజర్‌ బాగున్నాయని, ఆసక్తికరంగా సాగుతుందని, సక్సెస్‌ సాధించాలని చెప్పారు. హీరో, దర్శకుడు వీర్ సాగర్ మాట్లాడుతూ, మా `మరణం` సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అడివి శేష్ గారు విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది. మా సినిమా విజయానికి ఇది మా మొదటి అడుగు. నన్ను నా కథను నమ్మి మా చిత్రాన్ని నిర్మించిన  మా నిర్మాత బి రేణుక గారికి నా ధన్యవాదాలు` అని చెప్పారు. 

``మరణం` సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో అడివి శేష్ గారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ సినిమా లో మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా హీరో డైరెక్టర్ వీర్ సాగర్ గారికి ధన్యవాదాలు. కరోనా టైం లో లాక్ డౌన్ లో సినిమా చేశాము. అవుట్ ఫుట్ బాగా వస్తుంది. మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మా టీం కి ధన్యవాదాలు` అని చెప్పింది.