మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం తప్పు

First Published 22, Apr 2018, 1:17 PM IST
Adah sharma on casting couch
Highlights

క్యాస్టింగ్ కౌచ్ పై ఆదా శర్మ ఏమందో తెలుసా.?

ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని హీరోయిన్ ఆదాశర్మ తెలిపింది. సెక్సువల్ ఫేవర్ చేయాలా? వద్దా? అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని చెప్పింది. పని కోసం శారీరక సుఖం ఇవ్వడానికి కొందరు వెనుకాడటం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇది కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని... ఎన్నో చోట్ల ఇది కొనసాగుతోందని చెప్పింది. 

కాకపోతే, మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని తెలిపింది. తనకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది. బాలీవుడ్ తో పోల్చితే దక్షిణాదిలో సినిమా ఛాన్సులు దక్కించుకోవడం ఈజీ అని ఆదా తెలిపింది. దక్షిణాదిలో ఒక్క సినిమా హిట్ అయితే... అవకాశాలు వాటంతట అవే వస్తుంటాయని చెప్పింది. బాలీవుడ్ లో అవకాశాలు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదని తెలిపింది.

loader