ప్రముఖ ఫిల్మ్ మేకర్, థియేటర్ పర్సనాలిటీ ఆల్కే పదంసీ(90) శనివారం ఉదయం ముంబైలో మరణించారు. 1982 లో వచ్చిన హిస్టారికల్ డ్రామా 'గాంధి'లో ముహమ్మద్ అలీ జిన్నా అనే పాత్రతో పేరు గాంచారు

ప్రముఖ ఫిల్మ్ మేకర్, థియేటర్ పర్సనాలిటీ ఆల్కే పదంసీ(90) శనివారం ఉదయం ముంబైలో మరణించారు. 1982 లో వచ్చిన హిస్టారికల్ డ్రామా 'గాంధి'లో ముహమ్మద్ అలీ జిన్నా అనే పాత్రతో పేరు గాంచారు. 'లింటాస్ ఇండియా'కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా 14 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు.

'ఫాదర్ ఆఫ్ మోడరన్ ఇండియన్ అడ్వర్టైసింగ్' గా గుర్తింపు పొందాడు. ఎన్నో బ్రాండ్ లను పరిచయం చేశారు. ఏడేళ్ల వయసులోనే థియేటర్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు పదంసీ. విలియం షేక్స్ పియర్ ప్లే 'మర్చంట్ ఆఫ్ వెనిస్' తో పాపులర్ అయ్యారు.

మొదటిసారి 'టామింగ్ ఆఫ్ ది శ్రెవ్' అనే థియేటర్ ప్లే ని డైరెక్ట్ చేసి ఫిల్మ్ మేకర్ గా కెరీర్ మొదలుపెట్టాడు. అతడి చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2000లో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది.

అలానే 2012లో సంగీత్ నాటక్ అకాడమీ వారి ఠాగూర్ రత్న అవార్డు ని దక్కించుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…