Asianet News TeluguAsianet News Telugu

టైంకి రావు.. సిబ్బందికీ ఏం తెలియదు, సర్వీస్ ఇలాగేనా : ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై రానా ఆగ్రహం

దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో విమానాలు టైంకి రావని, విమానాల్లోని సిబ్బందికి కూడా ఏం తెలియదని ఆయన దుయ్యబట్టారు. 

actror Rana Daggubati slams Indigo airlines
Author
First Published Dec 4, 2022, 6:35 PM IST

తరచూ వార్తల్లో నిలుస్తోన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థపై టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన విమర్శలు గుప్పించారు. ఇండిగో వల్ల చెత్త అనుభవం ఎదురైందన్న రానా.. ఈ సంస్థ విమాన వేళలు సరిగా లేవని దుయ్యబట్టారు. మిస్సయిన లగేజీ ట్రాకింగ్ కూడా సరిగా లేదని.. సిబ్బందికి కూడా సరైన సమాచారం వుండదంటూ ఫైరయ్యారు. ఇటీవల హైదరాబాద్ నుంచి కుటుంబంతో పాటు బెంగళూరుకు వెళ్లారు రానా. బెంగళూరు చేరుకున్నాక లగేజీ రాకపోవడంతో రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే.. ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇండిగో విమానంలో తెలుగు మ‌హిళ‌కు అవ‌మానం జ‌రిగింది. భాష పేరుతో వివ‌క్ష‌కు గురైంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. అహ్మదాబాద్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ దేవస్మిత ఫోటోని షేర్ చేస్తూ సంబంధిత వివ‌రాల‌ను పంచుకున్నారు కేటీఆర్. ఇండిగో విమాన సిబ్బంది తీరును ఖండించారు. భాష రాలేద‌న్న కార‌ణంతో మ‌నుషుల‌ను అవ‌మానించ‌డం త‌గ‌ద‌న్నారు. హిందీ, ఇంగ్లీష్‌ భాష రాదనే కారణంతో ఇండిగో విమానంలో సిబ్బంది ప్ర‌వ‌ర్తించిన తీరును ఆయ‌న  ఖండించారు. 

స్థానిక భాష‌ను గౌర‌వించాల‌ని ఇండిగో విమాన స‌ర్వీసుల‌కు సూచించారు. అలాగే, హిందీ, ఇంగ్లీష్ తెలియ‌ని  ప్ర‌యాణికుల‌ను గౌర‌వించాల‌ని హిత‌వు ప‌లికారు.  "ప్రియమైన @IndiGo6E మేనేజ్ మెంట్, స్థానిక భాష‌ల‌తో పాటు హిందీ, ఇంగ్లీష్ తెలియ‌ని ప్రయాణికుల‌ను గౌర‌వించమ‌ని నేను మిమ్మ‌ల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రాంతీయ రూట్లలో, తెలుగు, తమిళం, కన్నడ మొదలైన స్థానిక భాషలను మాట్లాడగల మరింత మంది సిబ్బందిని నియమించుకోండి. ఇది విజయవంతమైన పరిష్కారం అవుతుంది" అంటూ ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios