పవన్ వేదాంతం అర్ధమయ్యేది కాదు.. నటి వ్యాఖ్యలు!

actress vasuki comments on pawan philosophy
Highlights

పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా అతడి కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్. ఆ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోయాయి

పవన్ కళ్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా అతడి కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్. ఆ సినిమాలో పవన్ నటనతో పాటు చాలా క్యారెక్టర్లు అభిమానులకు గుర్తుండిపోయాయి. అందుకే ఒకటి పవన్ చెల్లెలి పాత్ర. ఆ పాత్రలో తమిళ నటి వాసుకి నటించింది.

సినిమాలో వీరిద్దరి మధ్య ఎమోషన్ బాగా పండింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నామని వెల్లడించింది. అయితే తను ప్రేమిస్తోన్న విషయాన్ని అప్పట్లోనే పవన్ పసిగట్టారని అంటూ ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ తనకు ఎప్పటికీ మంచి స్నేహితుడని ఆయన ఎంత సరదాగా ఉంటారో చెప్పింది.

అలానే ఫిలాసఫీ బాగా చెప్పేవారనే విషయాన్ని బయటపెట్టింది. 'తొలిప్రేమ' సినిమా సమయానికి తన వయసు 18 ఏళ్లు మాత్రమే కావడంతో పవన్ చెప్పేవేదాంతం పెద్దగా తన బ్రెయిన్ కు ఎక్కేది కాదని కానీ ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలు గుర్తుకువస్తున్నాయంటూ చెప్పుకొచ్చింది నటి వాసుకి. 

loader