కరోనా కష్టాలు: రాఖీలు అమ్ముకుంటున్న సీరియల్ నటి
హిందీలో సూపర్ హిట్ అయిన హమారి బహు సిల్క్ నటి వందన విత్లాని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్త ఉపాది మార్గాలను ఎంచుకుంటుంది. ఇటీవల తన ఆవేదనను మీడియాతో పంచుకున్న వందన, తాను 2019 మే నుండి అక్టోబర్ వరకు షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపింది.
కరోనా మహమ్మారి వినోద పరిశ్రమ మీద దారుణమైన ప్రభావం చూపింది. దాదాపు అన్ని ఇండస్ట్రీలలోనూ నిర్మాణాలు, రిలీజ్, సీరియల్స్ ఆగిపోయాయి. దీంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ దగ్గర ఉన్న డబ్బులతో ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకొచ్చినా ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది. దీంతో కొంత మంది నటీనటులు పూట గడవడం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. చిన్న చిన్న పనులు చూస్తూ వెళ్లదీస్తున్నారు.
ఇప్పటికే పలువరు నటుడు కూరగాయల వ్యాపారం చేస్తూ, కుల వృత్తులు చేస్తున్న సంఘటనలు బయటకు రాగా.. తాజాగా ఓ నటి రాఖీలు అమ్ముతున్న సంఘటన వెలుగు చూసింది. హిందీలో సూపర్ హిట్ అయిన హమారి బహు సిల్క్ నటి వందన విత్లాని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొత్త ఉపాది మార్గాలను ఎంచుకుంటుంది. ఇటీవల తన ఆవేదనను మీడియాతో పంచుకున్న వందన, తాను 2019 మే నుండి అక్టోబర్ వరకు షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపింది.
కానీ సీరియల్ నిర్మాతలు కొంత మొత్తం పేమెంట్ మాత్రమే ఇచ్చారనీ, ఇంకా లక్షల రూపాయలు తనకు రావాల్సి ఉందని తెలిపింది. ఇన్ని నెలలుగా ఎన్నిసార్లు అడిగినా నిర్మాతలు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దాచుకున్న డబ్బు ఖర్చయిపోవటంతో రాఖీలు తయారు చేసిన ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నానని తెలిపింది. తన భర్త అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని, తమ ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపింది వందన.