ప్రతి సెలెబ్రిటీని పనికట్టుకుని విమర్శించేవారు సోషల్ మీడియాలో ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా ఈ ట్రోలింగ్ బారిన పడుతుంటారు. తాజాగా మరాఠి హీరోయిన్, టెలివిజన్ నటి అయిన తేజస్విని పండిట్ సోషల్ మీడియాలో విమర్శకుల బారీన పడింది. ఈ విషయాన్ని ఉమెన్స్ డే సందర్భంగా తేజస్విని తెలిపింది. అంతే కాదు తనని విమర్శించిన వారి దుమ్ము దులిపింది కూడా.తేజస్విని పండిట్ బుల్లి తేర సీరియల్స్ తో పాపులర్ అయింది. ప్రస్తుతం మరాఠి చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈ సెక్సీ భామకు ఇంస్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.ఇటీవల తేజస్విని బొద్దుగా మారుతోంది. రోజురోజుకు తేజస్విని లావైపోతుండడంతో నెటిజన్లు ఆమెకు అసభ్యంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకర కామెంట్స్ తో తేజస్విని మనస్తాపానికి గురైంది.ఈ కామెంట్స్ ని పట్టించుకోకూడదని నిర్ణయించుకుందట.

 

కానీ ఉమెన్స్ డే రోజు సందర్భంగా విమర్శకుల ఘాటు సమాధానం ఇచ్చింది. అవును నేను ఇటీవల కాస్త లావు అయ్యాను. అయితే ఇప్పుడు ఏంటి అంటూ ఘాటుగా స్పందించింది. మహిళలని గౌరవించడం నేర్చుకోండి అంటూ కౌంటర్ ఇచ్చింది.తనకు థైరాయిడ్ సమస్య ఉందని అందుకే ఈ మధ్య లావుగా మారానని తేజస్విని తెలిపింది. ఈ విషయాలు తెలియకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సబబు. ఒకవేళ నిజంగానే లావైనా మీకు సమస్య ఏంటి అంటూ చురకలటించింది.సోషల్ మీడియా వేదికగా బాడీ షేమింగ్ కు పాల్పడడం ఆపాలని తేజస్విని పండిట్ కోరింది. నటులు ఇలాగె ఉండాలని ఇక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించింది. అందరు నటులు ఎప్పుడూ ఒకేలా ఉండలేరనే సత్యాన్ని గ్రహించాలని కోరింది.