దర్శకుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో 48 ఏళ్ళ పిన్న వయసులోనే మరణించారు. పచ్చకామెర్లు రావడంతో ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
నటి సుజిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు సినిమాల్లో, టివి సీరియల్స్ లో రాణిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం చిత్రంలో అత్యంత కీలకమైన మూగ అబ్బాయి పాత్రలో నటించింది సుజితనే. జైచిరంజీవ చిత్రంతో మెగాస్టార్ కి సోదరిగా నటించింది. ఇప్పుడు సుజిత అవకాశం ఉన్నప్పుడు సినిమాల్లో నటిస్తూనే టివి సీరియల్స్ లో రాణిస్తోంది.
రీసెంట్ గా సుజిత కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు, దర్శకుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో 48 ఏళ్ళ పిన్న వయసులోనే మరణించారు. పచ్చకామెర్లు రావడంతో ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
అంతకు ముందు సూర్య కిరణ్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి సూర్య కిరణ్ మద్యానికి బానిసైనట్లు సన్నిహితులు చెబుతున్నారు.
తాజాగా సూర్య కిరణ్ మృతిపై అతడి చెల్లెలు సుజిత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'ఆయన నా అన్నయ్య మాత్రమే కాదు.. నా హీరో, నాకు తండ్రి కూడా. నీ మాటలకు, నీ ప్రతిభకి నేను ఎప్పడూ అభిమానిని. మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని ప్రార్థిస్తున్నా అంటూ సుజిత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
