సీరియల్ నటి, ఆమె కూతురు శుక్రవారం నాడు తానేలో తమ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సొంత తల్లే తన 18 ఏళ్ల కూతురిని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఆర్ధిక సమస్యలే దీనికి కారణమని అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రశాంత్ పార్కర్ (43) జిమ్ కి వెళ్లాలని ఉదయాన్నే 7:30 గంటల ప్రాంతంలో 
ఇంటి నుండి బయటకి వెళ్లారు.

ఆ సమయంలో ప్రశాంత్ భార్య ప్రాడ్న్య(40) తన కూతురురు శృతి(18)తో కలిసి ఉంది. ఆ తరువాత ప్రశాంత్ ఇంటికి తిరిగివచ్చి ఇంటి డోర్ బెల్ కొట్టగా.. ఎవరూ తీయకపోవడంతో తాళాలు పగలగొట్టి లోపాలకి వెళ్లి చూడగా.. లివింగ్ రూమ్ లో తన కూతురు చనిపోయి ఉంది. బెడ్ రూమ్ లో తన భార్య ఫ్యాన్ కి దుప్పటితో ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది.

వెంటనే ఇద్దరినీ దగ్గరలో ఉన్న ప్రమీలా హాస్పిటల్ కి తరలించగా.. వైద్యులు అప్పటికే ఇద్దరూ చనిపోయారని చెప్పారు. సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు భర్తని విచారించి ఆ ఇద్దరి చావులకు కారణం ఆర్ధిక సమస్యలేనని తేల్చారు. ప్రశాంత్ ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తుంటాడు. అతడి వ్యాపారం సరిగ్గా నడవడం లేదు. దీంతో ప్రాడ్న్య సీరియళ్లలో నటించడం మొదలుపెట్టింది. మరాఠీ సీరియల్స్ లో నటిస్తూ కొంతవరకు సంపాదిస్తుంది.

బాలీవుడ్ లో రాబోతున్న 'సెక్షన్ 375' అనే సినిమాలో కూడా ఆమె ఓ పాత్ర పోషించింది. కొంతకాలంగా తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రాడ్న్య తట్టుకోలేకపోతుంది. ఆ డిప్రెషన్ లోనే కూతురిని చంపేసి తను కూడా చనిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఇంటి వాళ్లు ప్రాడ్న్య తన కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునేదని.. తన కూతురే  ప్రపంచంగా బ్రతికేదని చెబుతున్నారు.