కొత్త సినిమాలు చేయలేని నువ్వు స్టార్ వా: శ్రీరెడ్డి

actress srireddy comments on nani
Highlights

నటి శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి నటుడు నానిపై సంచలన ఆరోపణలు చేసిన 

నటి శ్రీరెడ్డి గతంలో కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి నటుడు నానిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అతడిపై కామెంట్స్ చేసింది. తాజాగా నాని తన ట్విట్టర్ అకౌంట్ లో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాకు సంబంధించి ఒక ట్వీట్ చేశారు. సూపర్ హిట్ సినిమా 'కృష్ణార్జున యుద్ధం' సినిమా ఈ వీడియోలో చూడండి అంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టిన పోస్ట్ పై నాని స్పందిస్తూ.. 'సూపర్ హిట్ అంట.. అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా'' అంటూ రాసుకొచ్చారు. ఇదే పోస్ట్ ను తన ట్విట్టర్ లో షేర్ చేసిన శ్రీరెడ్డి దీనిపై ఎలా స్పందించిందో ఈ ట్వీట్ లో చూడండి!
 

loader