పోలీసులు లైంగికంగా వేధించారు.. నటి సంచలన ఆరోపణలు

First Published 28, Jul 2018, 1:10 PM IST
actress shruthi sensational comments on police
Highlights

ఎంతోమంది అబ్బాయిలను మోసం చేసి డబ్బు గుంజిందని, ఓ ఎన్నారైని పెళ్లి పేరుతో దారుణంగా మోసం చేసిందని కేసు పెట్టడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె తల్లి చిత్రం అలానే మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోవై జైలులో వేశారు.

తమిళ ఇండస్ట్రీలో సహాయక పాత్రల్లో నటించే శృతి అనే అమ్మాయి పెళ్లి పేరుతో కొందరు కోటీశ్వరులను మోసం చేస్తుందని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎంతోమంది అబ్బాయిలను మోసం చేసి డబ్బు గుంజిందని, ఓ ఎన్నారైని పెళ్లి పేరుతో దారుణంగా మోసం చేసిందని కేసు పెట్టడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెతో పాటు ఆమె తల్లి చిత్రం అలానే మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోవై జైలులో వేశారు.

అయితే కండీషన్ బెయిల్ మీద విడుదలైన ఆమె ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. తాను ఎవరినీ వివాహం చేసుకుంటానని మోసం చేయలేదని చెప్పుకొచ్చింది. అలానే విచారణ పేరుతో పోలీసులు తనను లైంగికంగా వేధించినట్లు సంచలన ఆరోపణలు చేసింది. విచారణ సందర్భంగా ఆమెను పిలిచి తప్పుగా ప్రవర్తించినట్లు ఈ విషయంపై న్యాయమూర్తికి కంప్లైంట్ చేయకుండా వదలనని స్పష్టం చేసింది. మరి ఈ విషయంపై పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తుందో చూడాలి!

loader