శ్రీ రెడ్డి ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన నటి సత్య చౌదరి

శ్రీ రెడ్డి ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన నటి సత్య చౌదరి

అన్యాయం జరిగిందని పోరాడాలి కానీ లేనిపోని మాటలతో పబ్లిక్ ను పిచ్చోళ్లను చేయద్దు. ఆమె ఇష్టం లేకుండా ఎవరైనా బలవంతం చేస్తారా... అలా చేస్తే కేసు పెట్టాలి కదా.. సినిమాల్లో అకాశాలిస్తామని ఎవడో ఆఫీసు పెట్టుకుని అవకాశాలిస్తామని చెప్పి... ఏదేదో చేస్తే.. ఎలా ఆమోదయోగ్యం అవుతుంది.

 

నటి శ్రీ రెడ్డికి చాలా ఆస్తులున్నాయని నటి సత్య చౌదరి ఆరోపించారు. నకనకలాడుతున్నానని చెప్పే శ్రీరెడ్డి ఆకలితో అలమటిస్తోందా.. నీకు ఆఢి కారు ఎలా వచ్చింది. బంగ్లా ఎలా వచ్చింది. ఆఫర్ లేకుంటే ఆస్తులెక్కడినుంచి వచ్చాయి. తీసిందే 3 సినిమాలు. జూబ్లీహిల్స్ లో బంగ్లా ఎక్కడినుంచి వచ్చింది. కోటిన్నర విలువైన కారు ఎక్కడిది. అడ్డగోలుగా నోరు పారేసుకుంటే చెప్పు తెగేదాక కొడతా. నన్ను ఏ ఛానల్ లో అయినా పిలిస్తే నేను మాట్లాడుతా.

 

కరాటే కల్యాణి మంచి నటి. సరస్వతి దేవి అనుగ్రహం వున్న ఆవిడ కరాటే కల్యాణి. అలాంటామెను కించపరిచేలా మాట్లాడినందుకే... నోటి దూల వల్లే తన్నులు పడ్డాయని సత్య వ్యాఖ్యానించారు. మేమున్నామని టాప్ దర్శకుడు తేజ లాంటి వాళ్లు స్పందించారు. అయినా నోరు అదుపులో పెట్టుకోకుండా ఇంకా అలాంటి వ్యాఖ్యలు చేస్తునే వుంది. పద్దతి మార్చుకోవాలి. ముఖం చూసుకున్నావా అద్దంలో. నీ ముఖం చూసి అసలు ఎవరైనా అధి అడుగుతారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సత్య చౌదరి. శ్రీరెడ్డి పనికట్టుకుని పథకం ప్రకారం చేస్తున్న కుట్ర తప్ప మరేం కాదని, తెలుగు సినీపరిశ్రమ పరువు తీసేందుకే శ్రీ రెడ్డి వ్యాఖ్యలు చేస్తుంది తప్ప మరేం లేదని సత్య ఆరోపించారు. ప్రవర్తన మార్చుకుంటే తనకు సరిపడే కేరక్టర్లు ఇస్తారని, అలా అందరికీ వస్తున్నాయని సత్య అన్నారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page