హీరోయిన్ సంగీత.. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా తెలిసిన పేరు. పెళ్ళాం ఊరెళితే, ఖడ్గం, ఖుషి ఖుషీగా, సంక్రాంతి లాంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హోమ్లీ లుక్ తో, నటనతో ఆకట్టుకుంది. సంగీత ఇటీవల కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అలీతో సరదాగా' అనే షోకు హాజరైంది. ఈ షోలో సంగీత తన కెరీర్ గురించి పలు సంగతులని పంచుకుంది. 

తన కెరీర్ గురించి ఆలోచించినప్పుడు 'మనోహరా' అనే చిత్రంలో నటించకుండా ఉండాల్సింది అని అనిపిస్తుందని సంగీతం పేర్కొంది. ఈ చిత్రంలో సంగీత, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మనోహరా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు నా వద్దకు వచ్చి కథ వివరించాడు. మరిదిపై మనసుపడే వదిన పాత్ర నాది. కథ వినగానే కోపంతో దర్శకుడిపై అరిచేశా. ఏంటి సర్ ఇలాంటి కథ తీసుకుని వచ్చారు.. ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఇది అని కోపంగా అడిగా. 

మేడం ఇది నా రియల్ లైఫ్ స్టోరీ అని దర్శకుడు తెలిపాడు. ఆయన మాటలకు షాకయ్యా. నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని అడిగా. కొందరు సైకియాట్రిస్ట్ లని కలసి ఈ కథ గురించి వివరించా. అలా ఆలోచించే యువతులు కూడా సమాజంలో ఉన్నారని తెలిపారు. ఆ తర్వాతే సినిమాకు ఓకే చెప్పినట్లు సంగీత తెలిపింది. ఒక రకంగా సంగీత తన కెరీర్ లో చేసిన బోల్డ్ రోల్ ఇదే.