బాలీవుడ్ లో 'మైనే దిల్ తుజ్ కో దియా' అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమీరారెడ్డి ఆ తరువాత తెలుగులో 'నరసింహుడు' మూవీతో పరిచయమైంది. ఆ తరువాత 'అశోక్', 'జై చిరంజీవ' వంటి చిత్రాల్లో నటించి పేరు సంపాదించుకుంది.

పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి తాజాగా తాను గర్భవతి అనే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు 'నిన్ను కలుసుకోవాలని ఎదురుచూస్తున్నా బేబీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2014లో సమీరా.. అక్షయ్ వాద్రాని వివాహం చేసుకున్నారు. 2015లో ఆమె ఓ మగబిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి ఆమె తల్లి కాబోతున్న విషయాన్ని వెల్లడించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Halfway there ! #baby #bump can’t wait to meet you ! 🌈 . . . #pregnantbelly 🙂❤️

A post shared by Sameera Reddy (@reddysameera) on Feb 12, 2019 at 1:05am PST