నానుంచి మరీ అంత ఆశించకండి.. సమంత

actress samantha says dont expect from me more
Highlights

అయితే ఈ పోస్టర్‌ను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘ ‘సీమరాజా’లో సమంత సుతంత్ర దేవి అనే సిలంబం టీచర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె మూడునెలల పాటు సిలంబంలో శిక్షణ తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.

నా నుంచి మరీ అంత ఆశించకండి అంటున్నారు స్టార్ హీరోయిన్ సమంత. ఇంతకీ ఏ విషయంలో సమంత ఇలా కామెంట్ చేసింది అనుకుంటున్నారా.. విషయం ఏమిటంటే.. సమంత రెండు తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయకు జోడీగా ఆమె ‘సీమరాజా’ చిత్రంలో నటించారు. మరోపక్క ‘యూ టర్న్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘సీమరాజా’ చిత్రం కోసం సమంత సిలంబం అనే మార్షల్‌ ఆర్ట్స్‌ను నేర్చుకున్నారు. ఇందులో ఆమె సిలంబం నేర్పించే టీచర్‌ పాత్రలో నటించారు.

దాంతో ఈ సినిమాపై సమంత అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇటీవల ‘సీమరాజా’ చిత్రంలోని సమంత పోస్టర్‌ ఒకటి బయటికి వచ్చింది. చక్కగా లంగావోణీలో పావురాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఆ పోస్టర్‌ నెటిజన్లను చాలా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టర్‌ను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ..‘ ‘సీమరాజా’లో సమంత సుతంత్ర దేవి అనే సిలంబం టీచర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇందుకోసం ఆమె మూడునెలల పాటు సిలంబంలో శిక్షణ తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.

దీనికి సమంత సమాధానమిస్తూ..‘ఓ మై గాడ్‌. నేను సిలంబం నేర్చుకోవడానికి కేవలం 15 రోజులు మాత్రమే శిక్షణా తరగతులకు వెళ్లాను. నా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించొద్దు.’ అని పేర్కొన్నారు. ఇందుకు మళ్లీ ఆ నెటిజన్‌ సమాధానం ఇస్తూ..‘మీరు మూడు నెలలు శిక్షణ తీసుకున్నారని దర్శకుడు పొన్రాం చెప్పారు. అందుకే మీ పాత్ర నుంచి కాస్త ఎక్కువే ఆశిస్తున్నాం’ అని ట్వీట్‌ చేశారు. ఇందుకు సమంత ప్రతి స్పందిస్తూ..‘వద్దు’ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చారు.
 

loader