నటి రీతా బాధురి కన్నుమూత!

Actress Reetha bhaduri is no more
Highlights

బాలీవుడ్ లో పలు సినిమాలు, సీరియళ్లలో నటించిన రీతా బాధురి(62) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని నటుడు శీర్షిర్ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు

బాలీవుడ్ లో పలు సినిమాలు, సీరియళ్లలో నటించిన రీతా బాధురి(62) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని నటుడు శీర్షిర్ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రీతా బాధురి గారి జీవిత ప్రయాణం ఇంతటితో ముగిసిందని చెప్పడం ఎంతో బాధను కలిగిస్తోంది. ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పర్షివాడా, అంథేరీ  ఈస్ట్ లో నిర్వహించనున్నారని స్పష్టం చేశారు.

గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రీతా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు. అయితే కిడ్నీ సమస్య కారణంగా శరీరంలో మిగిలిన అవయవాలు కూడా దెబ్బ తిన్నాయి. సడెన్ గా గుండెపోటు రావడంతో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. 1970 నుండి 1990 ల వరకు ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డులు కూడా అందుకున్నారు. 1975లో విడుదలైన 'జూలీ' సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  

loader