ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారి భారీ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటా అంటూ ఛాలెంజ్ చేశాడు.

బండ్ల గణేష్ కామెంట్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సినీ నటి రమ్య. బండ్ల గణేష్ లాంటి పిచ్చి కుక్కల్ని ప్రజలే కొట్టి చంపేయాలంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ''బండ్ల గణేష్ గురించి మాట్లాడుకోవడం వృధా.. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుందో అర్ధం కావడం లేదు. 

అతనికి ఏం అనుభవం ఉందని, రాజకీయాల గురించి ఏం తెలుసని ఇలా చేస్తుందో తెలియడం లేదు. అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వచ్చేసి ఏవేవో మాట్లాడుతున్నారు. అతడితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఈరోజు నేను ఆయన గురించి మాట్లాడడానికి కారణం ఆయన కేసీఆర్ లాంటి నాయకులను బూతులు తిట్టడమే..

కేసీఆర్ ని తిడితే నేనే కాదు ఏ ఆడపిల్ల అయినా ఇలానే మాట్లాడుతుంది. ఇలాంటి కుక్కల్ని రాజకీయాల్లో ప్రోత్సహించకండి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో పీక కోసుకుంటా అని ఛాలెంజ్ చేసిన ఆయన మాట మీద నిలబడాలి. అప్పుడైనా కాస్త నిజాయితీకి విలువ ఉంటుంది'' అంటూ చెప్పుకొచ్చింది.