సీనియర్ హీరోయిన్ రంభ (Rambha) కారు యాక్సిడెంట్ కు గురైంది. కారులో తన పిల్లలతో పాటు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. తన  కూతురు మాత్రం తీవ్ర గాయాలతో ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. 

సీనియర్ హీరోయిన్ రంభ ప్రమాదవశాత్తు తాజాగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి రంభకు స్వల్ప గాయాలే అయినప్పటికీ తన కూతురికి మాత్రం తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చిన్నారికి చికిత్స జరుగుతోంది. ఈ క్రమంలో దేవుడికి ప్రార్థించాలంటూ రంభ కారు యాక్సిడెంట్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

రంభ తెలిపిన వివరాల ప్రకారం.. తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, ఇంట్లో పనిచేసే ఆయా కూడా ఉంది. ఈ విషయాన్ని రంభే సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ప్రమాదంలో తనతో పాటు అందరికీ గాయాలయ్యాయని తెలిపింది. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డప్పటికీ తన కూతురు సాషా మాత్రం ఇంకా హాస్పిటల్ బెడ్డు మీదే ఉందని ఎమోషనల్ అయ్యింది. 

యాక్సిడెంట్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ప్రమాద తీరును రంభ వివరించింది... పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా.. ఇంటర్ సెక్షన్ వద్ద తమ కారును మరో కారు ఢీ కొట్టిందని తెలిపింది. దీంతో కారులోని అందూ గాయపడ్డారని పేర్కొంది. ప్రస్తుతం అందరూ సేఫ్ గానే ఉన్నప్పటికీ తన చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోందని తెలిపింది. వారిని చెడు సమయం వెంటాడుతోందని, వారి క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థించండి అంటూ అభిమానులను కోరింది. కెనడాకు చెందిన శ్రీలంక తమిళ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను రంభ వివాహం చేసుకుంది. వీరి ఇద్దురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ప్రస్తుతం కెనడాలోని టొరంటోలో స్థిరపడ్డారు.

View post on Instagram