Asianet News TeluguAsianet News Telugu

ఎస్‌ఐ భర్త మోసం చేశాడంటూ నటి రాధ ఫిర్యాదు.. అంతలోనే యూటర్న్

ఎస్‌ఐగా పనిచేస్తున్న తన భర్త వసంతరాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకుని తనని మోసం చేశాడని తమిళ నటి రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. కేసుని యూటర్న్ తిప్పింది. మరి ఇంతకి ఏం జరిగింది? ఆ కథేంటో చూస్తే..

actress radha withdraw her complaint on husband vasanth raj  arj
Author
Hyderabad, First Published Apr 17, 2021, 4:51 PM IST

ఎస్‌ఐగా పనిచేస్తున్న తన భర్త వసంతరాజ్‌ ప్రేమించి పెళ్లి చేసుకుని తనని మోసం చేశాడని తమిళ నటి రాధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. కేసుని యూటర్న్ తిప్పింది. మరి ఇంతకి ఏం జరిగింది? ఆ కథేంటో చూస్తే.. పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి రాధ తన మొదటి భర్తకి విడాకులిచ్చింది. చెన్నైలోని సాలిగ్రామంలోగల లోగయ్య వీధిలో తల్లి కుమారుడుతో నివసిస్తుంది. ఎస్‌ఐగా పనిచేస్తున్న వసంతరాజ్‌ని ప్రేమించి సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకుంది. కొన్నాళ్లపాటు బాగానే సాగిన వీరి వివాహ బంధం చిక్కుల్లో పడింది. 

గత కొన్ని రోజులుగా వసంతరాజ్‌ తనని వేధిస్తున్నాడట. హింసించడం చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ గురువారం చెన్నైలోని విరుగంబాక్కం పోలీస్‌ స్టేషన్‌లో భర్త వసంతరాజ్‌పై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును అనుసరించి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాల్సిందిగా రాధ, వసంతరాజ్‌లకు సమన్లు పంపారు. ఆ సమయానికి వారిద్దరూ హాజరుకాలేదు. గురువారం రాత్రి విరుగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నటి రాధ తానిచ్చిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఫిర్యాదు వెనక్కి తీసుకున్న సందర్భంగా ఆమె శుక్రవారం ఆమె మీడియాకు మాట్లాడారు. `ఓ మహిళా న్యాయవాది ద్వారా వసంతరాజ్‌తో పరిచయం ఏర్పడిందని, అది స్నేహంగా మారి ప్రేమకి దారితీసింది.  కొన్నాళ్లుకు అతను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని కోరాడు. త్వరలో ఇన్స్‌పెక్టర్‌గా పదోన్నతి వస్తుంది. నన్ను బాగా చూసుకుంటానని చెప్పాడు. మొదట్లో నేను నిరాకరించినా ఒంటరి జీవితంలో ఒక మగతోడు కావాలని భావించి మ్యారేజ్‌కి ఒప్పుకున్నా. 

సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకుని ఆ ఇంట్లోనే ఉంటున్నాం. అడయారులోని ఈ–కేంద్రానికి తీసుకెళ్లి నా ఆధార్‌కార్డులో, బ్యాంకు ఖాతాలో భర్తగా తనపేరు నమోదు చేయించాడు. పదేళ్లుగా వాడుతున్న కారును అమ్మివేసి నా డబ్బుతో కొత్తకారు కొనుక్కున్నా. కారు కొనుగోలుకు వసంతరాజ్‌ డబ్బులు ఇవ్వలేదు. అతడు కొనుక్కున్న కారుకు నేనే రూ.4.50 లక్షలు ఇచ్చా. ఇదిగాక అప్పుడప్పుడూ రూ.20వేలు, రూ.30వేలు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నన్ను అనుమానించి కొట్టడం, వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆయనపై ఫిర్యాదు  చేశా. జరిగిన సంఘటనలకు విచారం వ్యక్తం చేస్తూ పోలీసుల సమక్షంలో నన్ను క్షమాపణ కోరాడు. నా ఫిర్యాదు వల్ల అతని పదోన్నతి దెబ్బతినకూడదని కేసు వెనిక్క తీసుకున్నా` అని చెప్పింది రాధ. రాధ `సుందర ట్రావెల్స్` సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios