మలయాళ నటి ప్రియాంక తన భర్తని పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల్లో విడాకులు ఇచ్చింది. ఆలు ఆమె ఎందుకు తన భర్త నుండి విడిపోయిందనే విషయాలను బయటపెట్టలేదు ఈ నటి.

కానీ తాజాగా మీడియాకిచ్చిన భేటీలో ఆమె ఎందుకు దూరమైందనే విషయాన్ని చెప్పుకొచ్చింది. 2012లో దర్శకుడు లారెన్స్ రావ్ ని పెళ్లి చేసుకుంది ప్రియాంక. చాలా కాలం ప్రేమ తరువాత వీరి వివాహం జరిగింది.

మూడేళ్ల పాటు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. వారికి ముకుందరామ్ అనే కొడుకు కూడా పుట్టాడు. ఆ తరువాత మనస్పర్ధలు రావడంతో భర్త నుండి విడిపోయింది. దానికి అసలు కారణం తమ ఆంతరంగిక ఫోటోలను తన భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని, అందుకే ఆయనతో కాపురం చేయడం ఇష్టం లేక విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

అలానే తను నటించడం అతడికి ఇష్టం లేకపోవడంతో నటనకి స్వస్తి చెప్పాలని షరతులు విధించాడట. ఈ కారణాలతోనే భర్తకు దూరమైనట్లు వెల్లడించింది. 'వెయిల్' చిత్రంలో  హీరోయిన్ గా నటించిన ప్రియాంక ఆ తరువాత 'సెంగాత్తుభూమియిలే', 'వానం పార్తు సీమయిలే' వంటి తమిళ చిత్రాలతో పాటు మలయాళంలో కూడా నటించింది.