అక్కా, తమ్ముడికి కూడా లింక్ పెట్టే రకం: నటి ఫైర్

Actress priyanka fires on youtube channels
Highlights

ఏదైనా చేసేప్పుడు ఆలోచించి చేయాలని, ఇలాంటి వీడియోలు పెడితే మీకు వ్యూస్ వస్తాయేమో కానీ మా ఇళ్లల్లో పరిస్థితి అలా ఉండదని, ఇలాంటి వీడియోల కారణంగా మా ఇంట్లో వాళ్లకు ఏమైనా అయితే మీరు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించింది

తమిళ బుల్లితెర నటి ప్రియాంక బుధవారం నాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొందరు యూట్యూబ్ ఛానెల్స్ వారు తెలుగు బుల్లితెర నటి ప్రియాంక చనిపోయిందంటూ వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో అసహనానికి గురైన ప్రియాంక సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానెల్స్ మీద విరుచుకు పడింది.

టీఆర్ఫీ రేటింగ్స్ కోసం, డబ్బుల కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవడం సిగ్గుగా అనిపించడం లేదా అని మొదలుపెట్టిన ఈ నటి మర్యాదగా వీడియో డిలీట్ చేయకపోతే పరిణామాలు మరో విధంగా ఉంటాయని హెచ్చరించింది. వ్యూస్ కోసం అక్కా, తమ్ముడికి కూడా లింక్ పెట్టే రకమని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

ఏదైనా చేసేప్పుడు ఆలోచించి చేయాలని, ఇలాంటి వీడియోలు పెడితే మీకు వ్యూస్ వస్తాయేమో కానీ మా ఇళ్లల్లో పరిస్థితి అలా ఉండదని, ఇలాంటి వీడియోల కారణంగా మా ఇంట్లో వాళ్లకు ఏమైనా అయితే మీరు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించింది. 

loader