ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచాన్నే కలవరపెట్టే విధంగా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా సైనికులు బాంబుల దాడితో విరుచుకుపడుతున్నారు. దీనితో ఉక్రెయిన్ లో పరిస్థితులు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి.

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ప్రపంచాన్నే కలవరపెట్టే విధంగా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా సైనికులు బాంబుల దాడితో విరుచుకుపడుతున్నారు. దీనితో ఉక్రెయిన్ లో పరిస్థితులు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఎప్పుడు నెలకొంటుందో అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

భారత విద్యార్థులు వేలాదిమంది ఉక్రెయిన్ లో చిక్కుకు పోయారు. వారిని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లని ప్రభుత్వం చేస్తోంది. ఇదిలా ఉండగా యువ తమిళ నటి ప్రియా మోహన్, ఈమె ఫ్యామిలీ ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జోరందుకుంది. 

ప్రియా మోహన్, ఆమె భర్త, పిల్లలు ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా బాంబు దాడి చేసిన సమీపంలోనే వీరు చిక్కుకుపోయినట్లు నెటిజన్లు ఈ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. 

అంతకంతకు ఈ వార్త వైరల్ గా మారుతుండడంతో ప్రియా మోహన్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తాము ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలు ఫేక్ అని ఆమె తేల్చేసింది. తాను తన ఫ్యామిలీతో కోచ్చిలో సురక్షితంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. 

వాస్తవానికి ప్రియా మోహన్ గత నెలలో ఉక్రెయిన్ కి వెళ్ళింది. తన ఫ్యామిలీతో కలసి ప్రియా మోహన్ ఉక్రెయిన్ వెకేషన్ కి వెళ్ళింది. ఆ ఫొటోస్ ని ఆమె నెటిజన్లతో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీనితో ఆకతాయిలు కొందరు ఆ ఫోటోలని మార్ఫింగ్ చేస్తూ ఆమె ఫ్యామిలీ యుద్ధం జరుగుతుండగా, బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో చిక్కుకుపోయినట్లు ఫేక్ న్యూస్ సృష్టించారు. 

ప్రియా మోహన్ ప్రముఖ నటి పూర్ణిమ ఇంద్రజిత్ కి సోదరి. అక్కని ఆదర్శంగా తీసుకుని ప్రియా మోహన్ కూడా చిత్రపరిశ్రమలో రాణిస్తోంది. యూట్యూబ్ లో కూడా ప్రియా మోహన్ బాగా పాపులర్ ఐంది.