ఈ కరోనా, లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువగా ఫేమస్ అయిన నటి ఎవరూ అంటే ప్రగతి అని చెప్పచ్చు. వెండి తెరపై ఎంత హోమ్లీగా, మోడ్రన్ మదర్‌గా, అత్తగా ఎంతో చక్కగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపించి రచ్చ రచ్చ చేసింది. ప్రగతి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది అని కామెంట్స్ వచ్చినా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళింది.  యంగ్ హీరోయిన్‌లకు ఏమాత్రం తగ్గని అందం తనకుందని  ప్రూవ్ చేసుకుంది.

 ఆమె మెలికలు తిరుగుతూ వేసిన డ్యాన్స్ మూమెంట్స్, లుంగీ కట్టుకుని వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేసిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. ఇక సినిమాల్లో అయితే బాద్‌షా సినిమాలోనూ ఓ సన్నివేశంలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాత సినిమాలోని ఐటం సాంగ్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పేసిన తీరు ఎంతో ఆకట్టుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ప్రగతి తాజాగా  సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో అర్దరాత్రి షూట్ చేసింది. 

ఆ వీడియోలో ఆమెను కొంతమంది రౌడీలు చుట్టుముట్టి ఉన్నారు. అయినా ఆమె వాళ్లకు వెరవకుండా కర్రసాము చేస్తూ భయపెట్టింది.  అయితే అది సినిమా షూటింగ్ కోసం తీసిందని అర్దమవుతూనే ఉంది. అయితే ఏ సినిమా అనేది ఆమె రివీల్ చేయలేదు. కాకపోతే ఇలా తను నటిస్తున్న సినిమాకు ఆమె ఫ్రీ పబ్లిసిటీ చేస్తోంది. ఇలాంటి ఇంకెన్ని వీడియోలు వస్తాయో అంటున్నారు. ఆమెకు ఉన్న యాక్షన్ సీన్స్ పై ఉన్న ఆసక్తి ఈ సీన్స్ లో స్పష్టంగా కనపడుతోంది. కర్రసాము చేయటం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఎంత ప్రాక్టీస్ చేసిందో కానీ ఫెరఫెక్ట్ గా చేస్తోందని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. అందుకోసమే కదా ఆ కష్టం అంతా. ఏమంటారు.