Asianet News TeluguAsianet News Telugu

Pragathi:‘ఊ అంటావా మావా..'కు ప్రగతి మాస్ స్టెప్స్(వీడియో)

సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్టై కూర్చుంది. సాంగ్‌ రిలీజ్‌ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్లింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన

Actress Pragathi dance to Pushpa song
Author
Hyderabad, First Published Jan 17, 2022, 8:37 AM IST


ఆర్ఆర్ఆర్‌లోని నాటు సాంగ్ కు, అంతకు ముందు ప్రైవేట్ సాంగ్ బుల్లెట్ బండి పాటకు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు.. తాజాగా ఊ అంటావా పాట ట్రెండ్ అవుతోంది.. సామాన్యులకే కాకుండా చాలా మంది సెలబ్రెటీలకు కూడా ఈ స్పెషల్ సాంగ్ తెగ నచ్చేసినట్లుంది.. ఊ అంటావా మావా అంటూ ఊగిపోతున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్టై కూర్చుంది. సాంగ్‌ రిలీజ్‌ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్లింది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చిందేసిన ఈ పాట కోసం మేకర్స్‌ దాదాపు రూ.5కోట్లు వరకు ఖర్చుపెట్టారని చెప్పుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నటి ప్రగతి ఈ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసింది. ప్రగతి వేసిన స్టెప్పులు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. నిజానికి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ డాన్స్ వీడియో లను పోస్ట్ చేస్తుంది ప్రగతి. జిమ్ లో వర్క్ ఔట్ వీడియో లను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా జిమ్ లో వర్క్ఔట్ చేసిన తరువాత ఈ మాస్ స్టెప్పులు వేసింది.

 

 ఈ సాంగ్ నేపధ్యం విలన్ గా కనిపించే మంగళం శీను (సునీల్) ఇస్తున్న పార్టీలో వస్తుందీ ఈ సాంగ్.  సమంత ఇలాంటి హాట్ ఐటెం సాంగ్ గతంలో చేయలేదని చెప్పవచ్చు. ఏ విధమైన ఇబ్బంది పడకుండా తన ఎదర భాగం, తొడలు ఎక్సపోజ్ చేసింది.  తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళం,హిందీలో అయితే ఈ సాంగ్ కు జనం లేచి విజిల్స్,డాన్స్ వేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios