పద్దతిగా కనిపిస్తూనే రెచ్చిపోయింది!

First Published 22, May 2018, 6:15 PM IST
actress payal rajputh glamour photos
Highlights

ఒకే ఒక్క ట్రైలర్ తో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్ రాజ్ పుత్

ఒకే ఒక్క ట్రైలర్ తో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది పాయల్ రాజ్ పుత్. ఢిల్లీకు చెందిన ఈ బ్యూటీ కొన్ని సీరియళ్ళలో కనిపించింది. ఆ తరువాత పంజాబీలో 'సైరత్' సినిమా రీమేక్ లో నటించి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ సినిమా నటిగా ఆమెకు మంచి పేరే తీసుకొచ్చింది.

ఇప్పుడు RX100 అంటూ టాలీవుడ్ లో ఓ సినిమా చేసింది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఈ ట్రైలర్ లో పల్లెటూరి అమ్మాయిగా పద్దతైన లుక్ లో కనిపిస్తూనే హీరోతో కలిసి బోల్డ్ సన్నివేశాల్లో దర్శనమిచ్చింది.

లిప్ లాక్స్ మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ బ్యూటీ నటనతో కూడా మెప్పిస్తే టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయం. తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 

 

 

 

💋

A post shared by Payal Rajput (@rajputpaayal) on

loader