బుల్లితెర తమిళ నటి నీలాని తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక మైలాపూర్ పోలీసులను ఆశ్రయయించిన ఆమె తను పని చేసే చోటుకి రోజూ వచ్చి తనను పచ్చి బూతులు తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని తన ప్రియుడిపై కంప్లైంట్ చేసింది.

టీవీ సీరియల్స్ లో నటిస్తోన్న ఆమెకి లలిత్ కుమార్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో నీలాని షూటింగ్ లో ఉన్న సమయంలో ఆమె దగ్గరకి వెళ్లి పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు ఆమె ప్రియుడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన అతడు గొడవకి దిగి బూతులు తిడుతూ నానా గొడవ చేశాడు. అతడి వేధింపులు భరించలేక నీలాని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.