రాధిక మా ఆయనను కొట్టడానికి వచ్చేసింది : సీనియర్ హీరోయిన్ నళిని

Actress nalini shares about her marraige incident
Highlights

రాధిక మా ఆయనను కొట్టడానికి వచ్చేసింది

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లోని సీనియర్ కథానాయికల జాబితాలో నళిని పేరు కూడా కనిపిస్తుంది. అప్పట్లో ఆమె తమిళంలో చేసిన 'ప్రేమసాగరం' తెలుగులోను ఏడాది పాటు ఆడేసింది. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లోను ఆమె నటించారు. అలాంటి నళిని తాజాగా ఓ కార్యక్రమంలో హీరోయిన్ రాధికతో తన అనుబంధాన్నిపంచుకున్నారు.

రాధిక నాకు సోదరిలాంటిది. నాకు ఏదైనా జరిగితే అండగా తానే ముందుంటుంది. మా ఆయన ‘మనం విడిపోవాలి’ అన్నప్పుడు మా ఇంటికి వచ్చి, ‘నువ్వు ఏంటి దాన్ని చూసేది. నేను చూసుకుంటా’ అంటూ ఆయన్ని కొట్టేందుకు మీదకు కూడా వెళ్లిపోయింది.ఇక విజయశాంతి, గీత, ముచ్చెర్ల అరుణ అందరం కలుస్తూనే ఉండేవాళ్లం.
 

loader