మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. అన్నదమ్ములు కలిసిపోయారు నా గుండె ద్రవించింది అంటూ  కామెంట్ చేశారు. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్ అవుతుంది. 

మంచు ఫ్యామిలీలో అంతర్గత కలహాలు చోటు చేసుకున్నట్లు గట్టిగా వినిపిస్తోంది మంచు బ్రదర్స్ తో పాటు మోహన్ బాబు మీడియా ముందుకు రావాలంటే భయపడుతున్నారు. అదే సమయంలో తమ అసహనం బయటపెడుతున్నారు.ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ బాబు, మనోజ్ లను మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. మంచు బ్రదర్స్ మధ్య విబేధాలని వార్తలు వస్తుండగా, మీ స్పందన ఏంటని అడిగారు. మోహన్ బాబు, మనోజ్ తిక్క సమాధానాలు చెప్పారు. నీ భార్యతో నీకు ఎలాంటి సంబంధం ఉందో చెబుతావా? అని మోహన్ బాబు దారుణ కామెంట్ చేశారు. 

ఇక మంచు మనోజ్ ని అడగ్గా... నాకు రీసెంట్ కి సెగ్గడ్డ లేచింది, గోకుతారా? అంటూ సెటైర్ వేశాడు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ తాలూకు సమాధానాలు. ఏం చెప్పాలో తెలియక చేసే పనులని అర్థం అవుతుంది. విష్ణు తనతో గొడవ పడుతున్న వీడియో మనోజ్ సోషల్ మీడియాలో పెట్టగా ఈ రచ్చ షురూ అయ్యింది. విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ అనే రియాలిటీ షోలో భాగంగా మనోజ్ వీడియో షేర్ చేశారని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అది వర్క్ అవుట్ కాలేదు. విష్ణు-మనోజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది నిజమని పలువురి వాదన.

ఇదిలా ఉంటే మంచు లక్ష్మి సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపింది. బలగం మూవీ చూసి ఇద్దరు అన్నదమ్ములు కలిసిపోయారట. నిర్మల్ జిల్లాలో భూ వివాదాల కారణంగా 45 ఏళ్ళ క్రితం విడిపోయిన అన్నదమ్ములను బలగం మూవీ ఒక్కటి చేసిందట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అన్నదమ్ములు కలిసిపోయారన్న వార్త నా హృదయాన్ని ద్రవింపజేసిందని.. ఆమె కామెంట్ చేశారు. 

మంచు లక్ష్మి తమ్ముళ్లు విష్ణు, మనోజ్ మధ్య గొడవలని చర్చ నడుస్తున్న వేళ ఆమె పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. నెటిజెన్స్ ని ఆకర్షించింది. కాగా మనోజ్ రెండో వివాహ బాధ్యత మంచు లక్ష్మి తీసుకున్నారు. మోహన్ బాబు, విష్ణు ఈ వేడుకకు దూరంగా ఉన్న నేపథ్యంలో అన్నీ తానై వ్యవహరించారు. మోహన్ బాబు పెళ్లి ముహూర్తానికి కొన్ని నిమిషాల ముందు వచ్చారు. విష్ణు-మనోజ్ మధ్య జరుగుతున్న యుద్ధంలో లక్ష్మి సప్పోర్ట్ మనోజ్ కే అని సమాచారం. కాగా మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఈ చిత్రాన్ని ఆమె నిర్మించి నటించారు. అగ్ని నక్షత్రం విడుదల సిద్ధం అవుతుంది.