Asianet News TeluguAsianet News Telugu

మంచు లక్ష్మిని లైంగికంగా వేధించింది ఎవరు? నాకు కూడా తప్పలేదంటూ ఓపెన్ అయిన స్టార్ కిడ్!


మంచు లక్ష్మి క్యాస్టింగ్ కౌచ్ పై కీలక కామెంట్స్ చేశారు. తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని ఆమె ఓపెన్ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 
 

actress manchu lakhsmi opens on casting couch made sensational comments ksr
Author
First Published Aug 23, 2024, 10:06 AM IST | Last Updated Aug 23, 2024, 10:06 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం. చాలా మంది స్టార్ హీరోయిన్స్ అలాంటి అనుభవాలు మాకు ఎదురు కాలేదని చెప్పినా, అది అబద్దమే. అవకాశాల కోసం ప్రయత్నం చేసే అమ్మాయిలకు సహజంగా లైంగిక వేధింపులు ఎదురవుతాయి. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ కాస్టింగ్ కౌచ్ పై విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. దేశంలోనే అత్యధికంగా మలయాళ చిత్ర పరిశ్రమలో అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారనేది ఆ నివేదిక సారాంశం. 

ఒక మాఫియా కనుసన్నలలో కేరళ చిత్ర పరిశ్రమ నడుస్తుంది. కమిట్మెంట్స్ కి ఒప్పుకునే హీరోయిన్స్ ని ఒక సపరేట్ కేటగిరీగా వారు విభజించారట. కేరళ చిత్ర పరిశ్రమలో మహిళలు భయం, అభద్రతా భావంతో ఉంటున్నారు. చాలా మంది అమ్మాయిలు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులను బయటపెట్టడం లేదని కమిటీ తెలియజేసింది. అవకాశాలు, రెమ్యునరేషన్ విషయంలో మహిళలు వివక్షత ఎదురుకుంటున్నారని హేమ కమిటీ తేల్చింది. జస్టిస్ హేమ రూపొందించిన నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు పొందుపరిచారు. 

 ఇటీవల కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ మానభంగం, హత్య దేశాన్ని ఊపేస్తోంది. మహిళల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. కఠిన చట్టాలు తేవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. పలువురు సెలెబ్రిటీలు జూనియర్ డాక్టర్ హత్యను ఖండించారు. ఈ క్రమంలో మంచు లక్ష్మి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. కాగా మంచు లక్ష్మికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదట. తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమె పంచుకున్నారు. 

అసలు సమాజంలో మహిళలకు సముచిత స్థానం లేదు. వారికి సమాన అవకాశాలు, ప్రాధాన్యత కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. అన్యాయం జరిగితే బయటకు చెప్పాలని మహిళలకు మంచు లక్ష్మి సూచించింది. మంచు లక్ష్మి ఇంకా మాట్లాడుతూ.. నువ్వు ఎవరికీ చెప్పుకోలేవని, నీకు ఆ ధైర్యం లేదని భావించిన కొందరు వ్యక్తులు నిన్ను లైంగికంగా వేధిస్తారు. అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. కెరీర్ బిగినింగ్ లో నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయి. అలాంటి వారితో నేను దురుసుగా ప్రవర్తించాను. దాని వలన నేను ఉద్యోగం కోల్పోయాను, అన్నారు. 

మంచు లక్ష్మి కి గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆమె తండ్రి మోహన్ బాబు ఐదు దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉన్నారు. నటుడిగా, నిర్మాతగా రాణించారు. అంతటి మంచు లక్ష్మికి కూడా కాస్టింగ్ కౌచ్ తప్పలేదట. అమెరికాలో కెరీర్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి అనంతరం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ రోల్స్ చేసింది. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించింది. ప్రస్తుతం మంచు లక్ష్మి తన మకాం ముంబైకి మార్చింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios