ఆయన సినిమాల్లో కథ హీరోతో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే అంశాల్లో అతడి డైలాగులతో పాటు కాస్టింగ్ కూడా కచ్చితంగా మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చుట్టూ ఫోకస్ అవుతుంది అలాంటి రోల్స్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా క్యాలిక్యులేటెడ్ గా నటులను ఎంపిక చేసుకుంటాడు. అత్తారింటికి దారేది - అ..ఆ సినిమాల్లో నదియా.. అజ్ఞాతవాసిలో ఖుష్బూ ఇలాంటి వాళ్లలో దాగున్న ఓ కొత్త నటులను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా తీస్తున్న త్రివిక్రమ్ ఇందులోనూ ఓ లేడీ యాక్టర్ ను తిరిగి ప్రేక్షకులను పరిచయం చేయబోతున్నాడనే న్యూస్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఆ నటి స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా వెలిగిన తెలుగుమ్మాయి లయ అని తెలుస్తోంది. సినిమాలు తగ్గుతున్న టైంలోనే లయ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి బైబై చెప్పేసి వెళ్లిపోయింది. ఈ జనరేషన్ లో చక్కటి నటన తెలిసిన తెలుగుమ్మాయి లయే అన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ప్రేమించు సినిమా నటిగా ఆమె  టాలెంట్ ఏమిటో తెలియజేసింది. 

ఎన్టీఆర్ సినిమాలో లయ నటించే అవకాశం ఉందనే న్యూస్ టాలీవుడ్ లో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ ఆఫర్ కు లయ ఒప్పుకుని.. తిరిగి మేకప్ వేసుకోవడానికి ఒప్పుకుందా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఆమె తిరిగి నటించడానికి అంగీకరిస్తే మాత్రం తెలుగు తెరకు మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు అందుబాటులోకి వస్తుందన్న మాట మాత్రం వాస్తవం.