సీనియర్ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఈరోజు ఎన్నికల ఫలితాల సందర్భంగా ఖుష్బూకి అనుకోని షాక్ తగిలింది. ఆమె అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

దీంతో ఆమె చాలా బాధ పడుతుంది. ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న ఆమెకి సడెన్ గా ఆరోగ్యం పాడవడం ఎంతో బాధను కలిగిస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

'ఎన్నికల ఫలితాల సందర్భంగా నేనుఛానెల్స్ లో కనిపించడం లేదు. ఎందుకంటే నేను హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. ఎన్నికల డ్రామాని మిస్ అవుతున్నాను. మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ప్రకృతి దాన్ని పాడుచేస్తుంటుంది. చాలా డిసప్పాయింట్ అయ్యాను' అంటూ రాసుకొచ్చింది.