విజయ్ లియో మూవీ వివాదంపై కస్తూరి హాట్ కామెంట్స్.. బూతు పదంపై ఆగని రచ్చ..

ప్రస్తుతం తమిళనాట లియో మూవీ కాంట్రవర్సీ గట్టిగా నడుస్తోంది. ఈమూవీ ట్రైలర్ లో వాడిన బూతు పదం.. అంతటా చార్చనీయాంశం అయ్యింది. అంతే కాదుఈ విషయంలో సెలబ్రిటీలు కూడా స్పదిస్తున్నారు. తాజాగా గృహలక్ష్మీ ఫేమ్ కస్తూరి ఈ వివాదంపై స్పందించారు. 
 

Actress Kasthuri Hot Comments about Vijay Thalapathy Leo Movie JMS

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే ఒకటి చర్చనీయాంశం అయ్యింది. అదే లియో మూవీ ట్రైలర్‌. ఈ ట్రైలర్ లో ఒక బూతు పదం వినిపించింది. అయితే అది ఎవరో మాట్లాడితే ఏమో కాని..  ఏకంగా ఈసినిమా హీరో విజయ్ ఆ బూతు పదాన్ని ఉపయోగించడం, మూవీ టీమ్ దానిని మ్యూట్ చేయకుండా ఆ ట్రైలర్‌ను అలాగే విడుదల చేయడం పెద్ద దుమారాన్నే రేపింది. నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ విషయంపై స్పందిస్తున్నారు. 

తమిళంలో  స్టార్లను ఎప్పుడూ సపోర్ట్ చేసే ఆడియన్స్ కూడా ఈ విషయంలో వారిని విమర్షిస్తున్నారు. సినిమావాళ్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా.. వారికి ఈ బూతు పడానికి సబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు అంటూ..మీడియా సినిమావాళ్లను వదలకుండా వెంటాడుతోంది.  ఈ విషయంలో ఎవిరికి తోచినట్టు వారు స్పందిస్తుంటే.. కొంత మంది మాత్రం తమకు ఏంటి సంబంధం అన్నట్టు వదిలేస్తున్నారు. తాజాగా  ఈ కాంట్రవర్సీపై నటి  కస్తూరికి కూడా అదే ప్రశ్న ఎదురయ్యింది. అసలే కాంట్రవర్సీ స్టార్ గా పేరున్న ఆమెను మీడియా మిత్రులు ఈ వివాదంపై స్పందించమని అడిగారు. 

 ప్రస్తుతం సీరియల్స్‌లో బిజీగా ఉంటూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న కస్తూరి.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ ఇస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు. ఇటీవల కావేరి జలాలపై కస్తూరి స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సినిమాల్లో బూతులు మాట్లాడడంపై కూడా తాజాగా స్పందించి మరోసారి సెన్సేషన్ సృష్టించారు. కస్తూరి మాట్లాడుతూ.. ఎక్కడైనా కులం చూడాల్సిన అవసరం లేనప్పుడు సినిమాల్లోనే ఎందుకు? ప్రస్తుతం తమిళ సినిమాల్లో కులాన్ని ఉపయోగించడం ట్రెండ్‌గా మారిపోయింది. నేను వేదికపై కులాల గురించి మాట్లాడడం అభ్యుదయవాదం అని పిలవడం మానేస్తాను. ఆ ధోరణి చాలా తప్పు అని కస్తూరి అన్నారు. 

ఇక లియో ట్రైలర్‌లో విజయ్ మాట్లాడిన బూతు గురించి కూడా కస్తూరి మాట్లాడుతూ..తమిళ సినిమాలో ఇలాంటి అసభ్యపదజాలం, పరుష పదజాలం ఉపయోగించడం కొత్తేమీ కాదు. ఎక్కడో ముఖం లేని నటుడు మాట్లాడే మాటలకు, పాన్-ఇండియన్ నటుడు విజయ్ మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంది అంటూ తమిళ సినిమాలపై ఓపెన్ కౌంటర్ వేశారు కస్తూరి. పైగా విజయ్ లాంటి హీరో ఓపెన్‌గా అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆమె ఇండైరెక్ట్ గా విజయ్ డైలాగ్ ను వ్యాతిరేకించారు. విజయ్ కు తమిళంలో యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక ఆయన ఈ బూతు పదం మాట్లాడితే.. ఆయన ఫాలోవర్స్ కూడా ఇందులో తప్పేముంది అని వాళ్ళు కూడా మాట్లాడటం మొదలు పెడతారు. 

సాధారణంగా ప్రస్తుతం యూత్ లో తమ స్టార్స్ ను ఫాలో అయ్యే ట్రెండ్ నడుస్తుంది. తమ అభిమాన నటుడు ఏం చేస్తే అదే వారు కూడా చేస్తారు..  తమ ఫేవరెట్ హీరో విజయే ఇలాంటి పదాలు ఉపయోగించాడని, తన ఫ్యాన్స్ కూడా అలాంటి పదలు ఉపయోగించడం మొదలుపెడితే బాగుండదు కదా అని కస్తూరి.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది ఇలా జరుగుతుండగానే.. అటు దర్శకుడు కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios