Asianet News TeluguAsianet News Telugu

విద్యా వ్యవస్థ తీరుపై మండిపడ్డ జ్యోతిక!

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులు జీవితాలు కోల్పోతున్నారని నటి జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు. 

actress jyothika fires on education system
Author
Hyderabad, First Published Jun 26, 2019, 12:17 PM IST

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్దులు జీవితాలు కోల్పోతున్నారని నటి జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 35 శాతం మంది విద్యార్ధులు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారని.. అందులో మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్ధులు నీట్ లో ఎలా రాణించగలరని ప్రశ్నించారు. 

ప్రస్తుతం జ్యోతిక ప్రధాన పాత్రలో 'రాక్షసి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆమె విద్యా వ్యవస్థ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నమెంట్ స్కూల్స్ లో ఉపాధ్యాయుల హాజరు చాలా తక్కువగా ఉంటుందని.. ఇక నీట్ వంటి పరీక్షలకు విద్యార్ధులు ప్రత్యేకంగా శిక్షణ ఎలా తీసుకుంటారని ప్రశించారు. జాతీయ స్థాయిలో ఇటువంటి ప్రతిష్టాత్మక పరీక్షలు నిర్వహించేప్పుడు ప్రభుత్వ పాఠశాలలు, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే విద్యార్ధుల భవిషత్తును దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించాల్సిఉంటుందని చెప్పారు.

గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకొని నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వాలకు అర్ధం కాదా..? అంటూ మండిపడింది. ఇప్పటికైనా విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే లక్షలాది మంది జీవితాలు బాగుంటాయని చెప్పుకొచ్చింది.  

Follow Us:
Download App:
  • android
  • ios