బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ హీనాఖాన్ పై ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. హౌస్ లో మంచి పేరు తెచ్చుకున్న హీనాఖాన్ కు బంగారు ఆభరణాలకు సంబంధించిన కేసులో లీగల్ నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వస్తే.. ఓ బంగారు కంపెనీ ప్రకటనలో నటించిన హీనా ఖాన్, షూటింగ్ అనంతరం నగలను తిరిగి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుందట. దీనికి గాను ఆ కంపెనీ ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన హీనా ఖాన్ ఇందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. లీగల్ నోటీసులు తన ఇంటి కంటే ముందుగానే మీడియా హౌస్ కు ఎలా వెళ్లాయనే విషయం తనకు అర్ధం కాలేదంటూ ట్వీట్ చేసింది.

తన ప్రత్యర్థులను ఉద్దేశిస్తూ 'నా శత్రువులు నన్ను క్షమించాలి.. మీ ఆలోచన పని చేయలేదు. ఇంకాస్త కొత్తగా ట్రై చేయండి' అంటూ ఓ పోస్ట్ పెట్టింది. తనకు ఎలాంటి లీగల్ నోటీసులు రాలేదని చెప్పారు. అయితే హీనా ఖాన్ అడ్రెస్ తో ఉన్న లీగల్ నోటీసులను ఓ ఛానెల్ ప్రసారం చేయడంతో ఏది నిజమనే విషయం తేలడం లేదు.