టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. దశాబ్దాల కాలం నుంచి హేమ టాలీవుడ్ లో కీలకమైన నటిగా రాణిస్తోంది. అక్క, వదిన, అత్త, సవతి తల్లి తరహా పాత్రల్లో హేమ ఎంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఇరుగు పొరుగు ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం కదా అనిపించేలా హేమ నటించి మెప్పించగలదు. ఇక హేమ నిత్యం వార్తల్లో నిలవడం కూడా చూస్తూనే ఉన్నాం. 

 ఇండస్ట్రీలో ఏం జరిగినా హేమ ముందుండి ఆ కార్యక్రమంలో పాల్గొంటుంది. 90వ దశకంలోనే కెరీర్ ప్రారంభించిన హేమ వందల చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ పోషించింది. అయితే ఏదైనా వివాదం జరిగినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు హేమ అంతే బోల్డ్ గా ఉంటుంది.

అయితే ఇటీవల హేమకి కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. నటి హేమ రీసెంట్ లండన్ లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్ళింది. హేమ కుమార్తె పేరు ఇషా అని తెలుస్తోంది. నటి హేమ కుమార్తె లండన్ లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమార్తె వద్దకి హేమ సమ్మర్ వెకేషన్ వెళ్ళింది. ఇంగ్లాండ్ వీధుల్లో తల్లీ కూతుళ్లు తిరుగుతూ రచ్చ చేస్తున్నారు. 

ఇక్కడ హాట్ సర్పైజ్ ఏంటంటే.. హేమ ట్రెండీ లుక్.. కూతురితో పాటు హేమ కూడా డెనిమ్ జీన్స్ ధరించి కుర్ర భామ తరహాలో అందాలు చూపిస్తూ ఇచ్చిన ఫోజు నెట్టింట దుమారం రేపుతోంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ సేమ్ కాస్ట్యూమ్స్ లో రచ్చ అదిరిపోయేలా ఇచ్చిన ఫోజు వైరల్ అవుతోంది. సినిమాల్లో గయ్యాళిగా చీరకట్టులో కనిపించిన హేమ ఇలా జీన్స్ లో దర్శనం ఇచ్చే సరికి నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు.