Asianet News TeluguAsianet News Telugu

నటి హేమకి 'మా' ఆ కండిషన్ పెట్టిందా..ఇంకా ఎక్కువగా కెలికితే.. 

నటి హేమ గురించి ఇటీవల ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూశాం. దీనికి కారణం తెలిసిందే. హేమ బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Actress Hema gets relief from MAA dtr
Author
First Published Aug 24, 2024, 2:54 PM IST | Last Updated Aug 24, 2024, 2:54 PM IST

నటి హేమ గురించి ఇటీవల ఎంత పెద్ద రచ్చ జరిగిందో చూశాం. దీనికి కారణం తెలిసిందే. హేమ బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేయడం, హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలపడం జరిగింది. దీనితో హేమ కొన్ని రోజులు జైల్లోనే ఉన్నారు. 

ఆ తర్వాత హేమ బెయిల్ పై బయటకి వచ్చారు. హేమపై సంచలన ఆరోపణలు రావడం, పోలీసులు కూడా ఆమెని అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా కాస్త హడావిడి చేసింది. హేమని మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. హేమ తాను నిర్దోషిని అని నిరూపించుకునే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది అని తెలిపారు. 

అయితే ఇటీవల హేమ తాను నిర్దోషిని అని ఓ వీడియో రిలీజ్ చేసింది. కావాలనే తనని బలిపశువుని చేస్తున్నట్లు పేర్కొంది. తనకి డ్రగ్స్ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లు హేమ కొన్ని రిపోర్టులు కూడా చూపించింది. హేమ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత రెండు రోజులకి మా అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. 

తిరిగి హేమ మా సభ్యురాలిగా కొనసాగుతారని అధికారికంగా ప్రకటించారు. ఇది హెమ్కి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. అయితే హేమ మీడియాతో మాట్లాడకూడదని మా అసోసియేషన్ కండిషన్ పెట్టిందట. పోలీసులు హేమకి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ అని చెప్పారు. హేమ మాత్రం నెగిటివ్ అంటోంది. మీడియాతో మాట్లాడితే ఇలాంటి విషయాలపై రచ్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీడియాతో మాట్లాడొద్దని మా అసోసియేషన్ హేమకి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాలో మాట్లాడి ఈ వివాదాన్ని ఇంకా ఎక్కువగా కెలికితే ఇష్యూ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే హేమ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పినట్లు టాక్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios