Asianet News TeluguAsianet News Telugu

వైరల్ అవుతున్న జెనీలియా ఫోటోషూట్.. రీఎంట్రీకి రెడీనా!

జెనీలియా వివాహం తర్వాత వెండితెరకు దూరమైంది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని జెనీలియా 2012లో వివాహం చేసుకుంది. ఈ దంపతులు ఇద్దరు కుమారులు సంతానం. ఇన్నిరోజుల పాటు జెనీలియా తల్లిగా బిజీగా గడిపింది. త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు జెనీలియా తెలిపింది. 

Actress Genelia D'Souza's latest photo shoot goes viral
Author
Hyderabad, First Published Sep 15, 2019, 6:10 PM IST

కుర్రకారుతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా జెనీలియాకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో జెనీలియా చెరగని ముద్ర వేసింది. ఢీ, రెడీ, బొమ్మరిల్లు లాంటి విజయవంతమైన చిత్రాలు జెనీలియా పేరిట ఉన్నాయి. జెనీలియా తెలుగులో చివరగా నటించిన చిత్రం నా ఇష్టం. 

వివాహం తర్వాత వెండితెరకు కాస్త దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి కూడా అయిపోయింది. ఇన్నిరోజులు తల్లిగా పిల్లల ఆలనా పాలనతో బిజీగా ఉన్న జెనీలియా ప్రస్తుతం కాస్త తీరిక పడింది. త్వరలో తన కెరీర్ ని తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది. తనకు సరిపడే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు జెనీలియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

తాజాగా జెనీలియా ట్రెండీ లుక్ లో చేసిన ఓ ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది. జెనీలియా గ్లామర్ ఇంకా తగ్గలేదంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. జెనీలియా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. దీనితో ఆమె రీ ఎంట్రీ చిత్రం తెలుగులో ఉంటుందా లేక హిందీలో ఉంటుందా అనేది ఎదురుచూడాలి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Denim is a love that never fails❤️ 📷@kalsekarmrunal

A post shared by Genelia Deshmukh (@geneliad) on Sep 13, 2019 at 8:05pm PDT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

I see you 😎

A post shared by Genelia Deshmukh (@geneliad) on Sep 13, 2019 at 8:27pm PDT

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Denim Story ❤️

A post shared by Genelia Deshmukh (@geneliad) on Sep 13, 2019 at 8:13pm PDT

Follow Us:
Download App:
  • android
  • ios