మలయాళీ హీరోయిన్ గాయత్రీ కృష్ణ తమిళ చిత్రం జోకర్ తో వెండితెరకు పరిచయమైంది. ఆమె నటించిన తొలి చిత్రమే జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం విశేషం. జోకర్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా గాయత్రీ కృష్ణకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ కు అవకాలు లేవు. 

త్వరలో గాయత్రీ కృష్ణ తన ప్రియుడు జీవన్ ని వివాహం చేసుకోబోతోంది. వీరిద్దరూ ఒకే కళాశాలలో చదువుకున్నారు. అప్పటి నుంచే వీరిమధ్య ప్రేమ మొదలైంది. జీవన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనే సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు. ,మే 19న గురువాయూర్ లో వీరిద్దరి వివాహం జరగనుంది. మ్యారేజ్ రిసెప్షన్ ని మే 22న త్రివేండ్రంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

గాయత్రి చివరగా మెర్కు తోడారిచి మలై అనే చిత్రంలో నటించింది. సినిమా అవకాశాలు తగ్గడం, తమ ప్రేమకు కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడంతో గాయత్రీ పెళ్ళికి సిద్ధమవుతోంది.