Asianet News TeluguAsianet News Telugu

నా తల్లికి కరోనా వచ్చింది.. కాపాడండి: నటి ఆవేదన

నటి దీపికా సింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోతో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిలపై చర్చ మొదలైంది. నటి దీపికా సింగ్‌ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తన తల్లిని ఆసుపత్రిలో చేర్పించడానికి సహాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Actress Deepika Singhs Mom Tests COVID 19 Positive
Author
Hyderabad, First Published Jun 13, 2020, 5:39 PM IST

కరోన మహమ్మారి మన దేశంలో దుర్భర పరిస్థితుల దిశగా కొనసాగుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య మూడు లక్షలు దాటగా మహారాష్ట్ర, ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో బెడ్‌ల కొరత తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా నటి దీపికా సింగ్‌ అభ్యర్థనతో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిలపై చర్చ మొదలైంది. నటి దీపికా సింగ్‌ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తన తల్లిని ఆసుపత్రిలో చేర్పించడానికి సహాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీలకు ట్యాగ్‌ చేస్తూ ఆమె సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఢిల్లీలోని హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీలో పరీక్షలు నిర్వహించగా తన తల్లికి కరోనా పాజిటివ్‌ గా తేలింది. అయితే ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేసేందుకు పలు ఆసుపత్రులను సంప్రదించగా బెడ్లు ఖాళీ లేవన్న సమాధానమే వచ్చిందని వెల్లడించారు. దీపికా వీడియోపై స్పందించిన నెటిజెన్లు మీలాంటి సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మా అమ్మకు కరోనా ఎలా సోకిందో అర్ధం కావటం లేదు అని దీపిక వాపోయింది. అయితే తమ్మది ఉమ్మడి కుటుంబం అని ప్రస్తుతం కుటుంబంలోని ఇతర వ్యక్తులకు కూడా కరోనా సోకుతుందేమో అని భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం  చేసింది దీపికా సింగ్. ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావటంతో డిప్యూటీ కమీషనర్ అభిషేక్‌ సింగ్‌ ఆమెను హాస్పిటల్‌లో చేర్చినట్టుగా ట్వీట్  చేశారు. అయితే దీపికా ఆ ట్వీట్‌పై స్పందిస్తూ ఇంకా తన తల్లి ఇంట్లోనే ఉన్నట్టుగా ఆమె వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios