రోడ్డున పడ్డ హీరోయిన్.. ఆదుకునేవారే లేరా?

Actress Charmila speaks on her suicide attempts
Highlights

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే.. హీరోయిన్లకు లైఫ్ స్పాన్ చాలా తక్కువ

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే.. హీరోయిన్లకు లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే నేటి తరం హీరోయిన్లు సంపాదించిన మొత్తాన్ని ఇతర వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అయితే సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం తెలియక జల్సాలు చేసే వాళ్లు కూడా బాగానే ఉన్నారు.

డబ్బు ఉన్నప్పుడు దాని విలువ తెలియకుండా ఖర్చు పెట్టిన నటి ఇప్పుడు రోడ్డున పడింది. ఆత్మహత్య చేసుకోవాలనుందంటూ మీడియా ముఖంగా చెబుతోంది. అసలు విషయంలోకి వస్తే.. ఒకప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్ గా పేరు గాంచిన చార్మిళ ఇప్పుడు మొత్తం కోల్పోయి సినీ పెద్దల సహాయాన్ని కోరుతోంది. ఆమె మాట్లాడుతూ.. 

''సంపన్నుల కుటుంబంలో పుట్టడంతో ఎలాంటి లోటు లేకుండా పెరిగాను. సినిమా ఇండస్ట్రీలో కూడా బాగానే సంపాదించాను. కానీ ఒక్క రూపాయి కూడా దాచుకోలేకపోయాను. ఇప్పుడు మొత్తం పోగొట్టుకొని ఇతరుల సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పటి హీరోయిన్ ను అయినా ఇప్పుడు సినిమాలలో నటించడానికి అవకాశాలు ఇవ్వడం లేదు. నా జీవితంలో సంపాదించిన సగం డబ్బు మొత్తం విదేశాల్లో తిరగడానికి ఖర్చు చేశాను. ఆస్తులు మొత్తం అమ్మి ఇంకా పెద్ద తప్పు చేశాను. శారీరకంగా, మానసికంగా ఎంతో నష్టపోయాను'' అంటూ కన్నీటి పర్యంతమయింది. 

loader