హిందీలో ప్రసారం కాబోతున్న `బిగ్‌బాస్ 15వ సీజన్‌లో పాల్గొనబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. హోస్ట్ సల్మాన్ భూమికని తీసుకోవాలని చెప్పారని, దీంతో ఆమెని కంటెస్టెంట్‌గా ఫైనల్ చేశారనే వార్తలు వినిపించాయి.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది భూమిక. తాజాగా ఆమె `బిగ్‌బాస్`లో కంటెస్టెంట్‌గా పాల్గొనబోతుందనే వార్తలు గుప్పుమన్నాయి. భూమిక నెక్ట్స్ హిందీలో ప్రసారం కాబోతున్న `బిగ్‌బాస్ 15వ సీజన్‌లో పాల్గొనబోతున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. హోస్ట్ సల్మాన్ భూమికని తీసుకోవాలని చెప్పారని, దీంతో ఆమెని కంటెస్టెంట్‌గా ఫైనల్ చేశారనే వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై భూమిక స్పందించింది.
ఈ వార్తలు వైరల్ గా మారడంతో దీనిపై తాజాగా స్పందించింది భూమిక. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. భూమిక `నేను బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాననే వార్తల్లో నిజం లేదు. ఇది ఫేక్ న్యూస్. నాకు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఒకవేళ షో కోసం నన్ను సంప్రదించినా నేను వెళ్లడానికి సిద్ధంగా లేను. గతంలో 1, 2, 3 సీజన్లు సహా మరికొన్ని సీజన్ల కోసం నన్ను సంప్రదించారు. కానీ నేను అంగీకరించలేదు. భవిష్యత్‌లో కూడా బిగ్‌బాస్‌కి వెళ్లే ప్రసక్తే లేదు. నేను పబ్లిక్ వ్యక్తినే. కానీ 24 గంటలు కెమెరా ముందే ఉండటం ఇష్టం లేదు. నాకంటూ ప్రైవేట్ లైఫ్ ఉంది` అని పేర్కొంది భూమిక.
దీనికి పలువులు సినీ తారలు స్పందించి అప్రిషియేట్ చేస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారని కామెంట్ చేస్తున్నారు. సాలిడ్‌గా స్టాండ్ తీసుకున్నారని అంటున్నారు. తెలుగులో భూమిక ఇటీవల నాని నటించిన `మిడిల్ క్లాస్ మెలోడీస్`లో నటించింది. ఆ తర్వాత `సవ్యసాచి`, `రూలర్`లో మెరిసింది. ఇప్పుడు `సీటీమార్`, `ఇది మా కథ`, `పాగల్` చిత్రాల్లో నటిస్తుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీ అవుతుంది భూమిక.
