నన్ను బిగ్ బాస్ షోకి పంపి నా భర్త వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు, ఇద్దరూ జంప్..నటి కామెంట్స్ వైరల్ 

హిందీతో పాటు సౌత్ భాషల్లో కూడానా బిగ్ బాస్ షో దూసుకుపోతోంది. బిగ్ బాస్ షో వల్ల చాలా మంది సెలెబ్రిటీల జీవితాలు మారిపోయాయి. సామాన్యులని సైతం బిగ్ బాస్ షో సెలెబ్రిటీలుగా మార్చేసింది.

Actress Arya shocking comments on her husband dtr

హిందీతో పాటు సౌత్ భాషల్లో కూడానా బిగ్ బాస్ షో దూసుకుపోతోంది. బిగ్ బాస్ షో వల్ల చాలా మంది సెలెబ్రిటీల జీవితాలు మారిపోయాయి. సామాన్యులని సైతం బిగ్ బాస్ షో సెలెబ్రిటీలుగా మార్చేసింది. తెలుగులో చివరగా ముగిసిన సీజన్ 7లో సామాన్య రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలన విజయం అందుకున్నాడు. 

అయితే మలయాళీ బిగ్ బాస్ షో వల్ల ఒక నటి జీవితమే తలక్రిందులుగా మారిపోయింది. మలయాళీ నటి ఆర్య బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఆమెకి పెళ్ళై ఒక కుమార్తె కూడా. కానీ బిగ్ బాస్ షో నుంచి తిరిగి వెళ్ళాక ఆమె భర్త జంప్ అయ్యాడు. 

ఏం జరిగిందని ఆరా తీస్తే ఆమె భర్త మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుని వెళ్లిపోయినట్లు తెలిసింది. ఆ క్షణంలో ఒకవైపు ఏడుపు మరోవైపు అతడిని చంపేయాలనేంత కోపం వచ్చినట్లు ఆర్య పేర్కొంది. తనని వదిలించుకునేందుకు తన భర్త తనని బిగ్ బాస్ షోకి పంపినట్లు ఆర్య ఆవేదన వ్యక్తం చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arya Babu (@arya.badai)

ఎంతో ప్రేమగా నన్ను బిగ్ బాస్ షోకి పంపాడు. ఎయిర్ పోర్ట్ కి వచ్చి పంపించాడు. అప్పుడే నాకు అనుమానం కలిగింది. తిరిగి వచ్చి ఫోన్ చేస్తే ఎలాంటి సమాధానం లేదు. అసలు లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో వాళ్లిద్దరూ దుబాయ్ లో ఉన్నారని తెలిసింది. కానీ కోవిడ్ కారణంగా వెళ్లలేకపోయా అని ఆర్య తెలిపింది. ప్రస్తుతం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. నటి ఆర్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios