నటి అర్చన బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బలమైన పోటీ ఇచ్చింది. ఇటీవల అర్చన సినిమాల్లో కనిపించడం బాగా తగ్గింది. శ్రీరామ దాసు, నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా లాంటి చిత్రాల్లో అర్చన నటించింది. యమదొంగ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో సైతం మెరిసింది. 

ఇదిలా ఉండగా అర్చన గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తోంది. ఇటీవల అర్చన సోషల్ మీడియాలో అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. బాయ్ ఫ్రెండ్ తన నుదిటిపై ముద్దు పెడుతుండగా ఆమె స్నేహితురాలు తీసిన ఫోటో ఇది. 

ఈ ఫోటోని షేర్ చేస్తూ మనం సైలెంట్ గా ఉన్న సమయంలోనే కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. త్వరలోనే మీకు ఓ గొప్ప వార్తని తెలియజేస్తా. అంతవరకు ఈ ఫొటోలతో ఎంజాయ్ చేయండి అంటూ అర్చన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. 

అర్చన త్వరలో చెప్పబోయే వార్త తన పెళ్లి వార్తే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అర్చన తన ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది.