బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టంట్ గా అందరి మనసులు దోచుకున్న అర్చన షో చివరి వరకు కూడా కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు సీజన్ 2 మొదలైన క్రమంలో ఆమె ఈ షోపై కొన్ని కామెంట్లు చేసింది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఇద్దరు పోటీదారులు ఎలిమినేట్ అయ్యారు.

ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనే విషయంలో అర్చన జ్యోతిష్యం చెబుతోంది. ఈసారి హేతువాది బాబు గోగినేని ఈ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటోంది అర్చన. గత కొన్ని రోజులుగాఆయన బిగ్ బాస్ హౌస్ లో ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. హౌస్ లో అందరూ సమానమేనని.. కొన్ని టాస్క్ లు చేయనని ఆయన నేరుగా చెప్పడం షాకింగ్ గా ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇక నాని హోస్ట్ గా చక్కగా పెర్ఫార్మ్ చేస్తున్నాడని ఈ హౌస్ లో తనకు ఇష్టమైన వారు కూడా ఉన్నారని వారి పేర్లను వెల్లడిస్తానని అన్నారు.