సీనియర్ నటి కూతురు బలవన్మరణం!

actress annapoorna's daughter commits suicide
Highlights

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆమె కూతురు బలవన్మరణానికి పాల్పడడం షాక్ కు గురి చేసింది

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆమె కూతురు బలవన్మరణానికి పాల్పడడం షాక్ కు గురి చేసింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆమె కుమార్తె కీర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నపూర్ణకి పిల్లలు లేకపోవడంతో కీర్తి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. మూడేళ్లకే క్రితం ఆమెకు వెంకట కృష్ణ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసు గల బిడ్డ కూడా ఉందని తెలుస్తోంది. ఈరోజు తెల్లవారు జామున కీర్తి బెడ్ రూమ్ డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి డోర్ పగలగొట్టి కూడగా ఆమె ఉరివేసుకొని కనిపించిందని చెబుతున్నారు. బంజారాహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఆ కారణంగానే సూసైడ్ చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!

loader