సీనియర్ నటి అంజు తన పెళ్లి విషయంలో మోసపోయిన తీరుని వెల్లడించి ఆవేదన చెందారు. ఓ పెద్ద స్టార్ హీరో తనని మోసం చేశాడని ఆమె ఆరోపించారు. మూడు పెళ్లిళ్ల విషయాన్ని దాచి తనని పెళ్లి చేసుకున్నాడని, ఆ విషయం తెలిసి ఆయన్ని వదిలేసినట్టు తెలిపింది అంజు.
`బాల నాగమ్మ` చిత్రంలో బాల నాగమ్మగా నటించి తెలుగుకి సుపరిచితం అయ్యారు నటి అంజు. చైల్ట్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. తెలుగులో `అగ్ని పూలు`, `కోడే త్రాచు`, `నిరీక్షణ` వంటి సినిమాలు చేశారు. ఎక్కువగా తమిళం, మలయాళంలో హీరోయిన్‌గా చేసి స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు అంజు. ప్రస్తుతం ఆమె సీరియల్స్ నటిగా రాణిస్తున్నారు. కోలీవుడ్‌లో సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె మీడియా ముందుకొచ్చారు. తాను ఎదుర్కొన్న స్ట్రగుల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు.
ముఖ్యంగా తన పెళ్లి విషయంలో మోసపోయిన తీరుని వెల్లడించి ఆవేదన చెందారు. ఓ పెద్ద స్టార్ హీరో తనని మోసం చేశాడని ఆమె ఆరోపించారు. మూడు పెళ్లిళ్ల విషయాన్ని దాచి తనని పెళ్లి చేసుకున్నాడని, ఆ విషయం తెలిసి ఆయన్ని వదిలేసినట్టు తెలిపింది అంజు. 17ఏళ్ల వయసులో తాను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని తలక్రిందులు చేసిందని ఆమె వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె అసలు విషయాలను బయటపెట్టింది.
నటి అంజు మాట్లాడుతూ, తాను ఏడాదిన్నర వయసున్నప్పుడు వాళ్లమ్మ ఓ సినిమా వంద రోజుల వేడుకకి తీసుకెళ్లిందట. అక్కడ దర్శకుడు మహేంద్రన్ చూసి అమ్మాయి చాలా క్యూట్‌గా ఉంది, సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలిస్తామని తెలిపారట. అలా తన కెరీర్ బాల నటిగా ప్రారంభమైందని చెప్పింది అంజు. బాల నటిగా ఎదిగిన తాను తమిళం, మలయాళం, కన్నడ, తెలుగులోనూ నటించినట్టు చెప్పింది. అయితే తాను 17ఏళ్ల వయసులో తాను కన్నడ సినిమా కోసం బెంగుళూరు వెళ్లిందట. అక్కడ అప్పటికే స్టార్ హీరోగా రాణిస్తున్న టైగర్ ప్రభాకర్ తనని చూసి ఇష్టపడ్డాడని తెలిపింది. అంతేకాదు తన ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారట.
అయితే ఆయనకు అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి, భార్య, పిల్లలు ఉన్నారనే విషయాన్ని చెప్పలేదని, ఆ విషయాన్ని దాచి తనని పెళ్లి చేసుకోవాలని ఆయన ఒత్తిడి తీసుకొచ్చినట్టు చెప్పింది. అప్పుడు తన ఏజ్ కేవలం 17ఏళ్లే అని, తాను పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పినా వినలేదని, వెంటపడ్డాడని తెలిపింది. అయితే అప్పటికే ప్రభాకర్ వయసు యాభై ఏళ్లు ఉంటుంది. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పగా వాళ్లు నో చెప్పారని, కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకర్ కోసం తాను ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పింది. తల్లిదండ్రులను కాదని ఆయన్ని పెళ్లి చేసుకుందట. కానీ ఆ తర్వాత అసలు విషయం బయటపడిందట.

ప్రభాకరన్‌కి అప్పటికే మూడు పెళ్లిళ్లు అయి పిల్లలు కూడా ఉన్నారని తెలిసి తాను షాక్‌కి గురైనట్టు వెల్లడించింది. ఆ విషయం దాచి తనని మోసం చేసిన విషయాన్ని ఆయన్ని ప్రశ్నించినందుకు తాను చెడ్డదాన్ని అయిపోయాను, తనని చెడుగా క్రియేట్ చేశాడని, తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయానని పేర్కొంది నటి అంజు. అప్పటికే తాను గర్భవతిగా ఉన్నానని, అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటి వచ్చేశానని, తన బంగారాన్ని కూడా అక్కడే వదిలేసివచ్చినట్టు చెప్పింది.
ఆయన్ని వదిలేసి వచ్చినప్పుడు తాను ఒక్కటే చెప్పా, నన్ను చాలా బ్యాడ్ చేశావు, ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నా, ఇంకెప్పుడు ఈ గడప తొక్కను, నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్టు వెల్లడించింది అంజు. ఆ తర్వాత కొంత కాలం తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, దాన్నుంచి నెమ్మదిగా కోలుకుని ఇప్పుడు తిరిగి సీరియల్స్ లో నటిస్తున్నట్టు చెప్పింది నటి అంజు. 1996 హీరో టైగర్ ప్రభాకర్ కి పెళ్లి చేసుకుని ఏడాదికే విడిపోయింది అంజు. వీరికి అర్జున్ ప్రభాకర్ కుమారుడు ఉన్నాడు. 2001లో టైగర్ ప్రభాకర్ కన్నుమూశారు. ఆయన తెలుగులో విలన్‌గా పరిచయం. `విక్రమ్`, `పట్టాభిషేకం`, `నిప్పు రవ్వ`, `జేబు దొంగ`, `నేటి సిద్ధార్థ` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.
