మ్యారేజ్‌ చేసుకోబోతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇవి వైరల్‌గా మారడంతో తాజాగా ఛార్మి స్పందించింది. 

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించి ఇటీవల నిర్మాతగా సెటిల్‌ అయిన ఛార్మి త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఆమె తమ బంధువులకు చెందిన అమ్మాయిని మ్యారేజ్‌ చేసుకోబోతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇవి వైరల్‌గా మారడంతో తాజాగా ఛార్మి స్పందించింది. అందులో నిజం లేదని, అలాంటి తప్పు తాను చేయదలుచుకోలేదని వెల్లడించింది. ఈ మేరకు ఛార్మి ఓ నోట్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 

ఇందులో ఆమె చెబుతూ, `ప్రస్తుతం కెరీర్‌ పరంగా మంచి స్థానంలో ఉన్న. గొప్ప క్షణాలను అనుభవిస్తున్నా. ఈ లైఫ్‌ చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను` అని ప్రకటించింది. ఈ సందర్భంగా గాసిప్‌ రాయుళ్లకి చురకలంటించింది. `ఫేక్‌ రైటర్స్, రూమర్స్ కి గుడ్‌ బై. ఆసక్తికర వార్తలను క్రియేట్‌ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా` అని పేర్కొంది ఛార్మి. ప్రస్తుతం ఆమె నోట్‌ సైతం వైరల్‌గా మారింది.

Scroll to load tweet…

ఛార్మి ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయనకు చెందిన పూరీ టూరింగ్‌ టాకీస్‌, ఛార్మి స్టార్ట్ చేసిన పూరీ కనెక్ట్స్ పతాకాలపై ఇటీవల వరుసగా సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా `లైగర్‌` సినిమాని పాన్‌ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీలో తెరకెక్కుతున్న చిత్రమిది. అనన్య పాండే కథానాయికగా. కరణ్‌ జోహార్‌ మరో నిర్మాత. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. పూరీ దర్శకుడు.