అమృతా రావు.. ఈ పేరుని సినీ అభిమానులు వినే ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతిథి చిత్రంలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అమృత రావు మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. తాజాగా అమృతా రావుకు ఊహించని షాక్ ఎదురైంది. 

ఇటీవల తరచుగా సినీ తారల సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కి గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కి గురైనట్లు అమృత ప్రకటించింది. ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి తనని ఇంటర్వ్యూకి అనుమతి కోరుతూ ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ని నా సోషల్ మీడియా టీం క్లిక్ చేయగానే ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. 

 గతంలో ఇలానే అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందని, ఇది ఒక ప్రమాదకర ధోరణిలా మారిందని అమృత ఆందోళన వ్యక్తం చేసింది. ప్రముఖ నటుడు తుషార్ కపూర్ నుంచి తనకు మెసేజ్ వచ్చిన తర్వాత ట్విట్టర్ హ్యాక్ అయిందని అమితాబ్ అప్పట్లో తెలిపారు. 

షాహిద్ కపూర్, అద్నాన్ సమీ ట్విట్టర్ ఖాతాలు కూడా గతంలో హ్యాక్ అయ్యాయి.