ఎప్పుడూ రాజకీయా గొడవలతో వార్తల్లోకి వచ్చే తమిళనాడు సినీ ప్రముఖులు ఇప్పుడు సొంత గూటిలోనే వర్గపోరుకు దిగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విశాల్ పై ఆరోపణలు చేయడం అలాగే విశాల్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో కోలీవుడ్ అంతా షాకయ్యింది. అసలు ఏం జరుగుతోంది అనే విషయంలో అనుమానాలు ముదరకముందే పోలీసులు విశాల్ ను విడిచిపెట్టారు.

అంతే కాకుండా టీనగర్ లోని నిర్మాతల మండలి కార్యాలయాన్నీ మూసేసి ఎవరిని పరిసరాల ప్రాంతాలకు రాకుండా 144 సెక్షన్ ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తతో భారీ బందోబస్తుతో పోలీసులు టీ నగర్ ను వారి అధీనంలోకి తెచ్చుకున్నారు. విశాల్ నిర్మాత మండలిలో నిధులను పక్కదారి పట్టిస్తున్నారని పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదని ఓ వర్గం వారు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే ఉదయం విశాల్ నిర్మాతల మండలి ఆఫీస్ కు తాళం వేయడాన్ని వ్యతిరేకిస్తూ తీయడానికి వెళ్లగా పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని గంటల తరువాత పోలీసులు విచారణ జరిపి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక విశాల్ పై వ్యతిరేకతతో ఉన్న పలువురు మండలి సభ్యులు తమిళనాడు సీఎం పళని స్వామికి పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.